News

తిరుమల ఆర్జిత సేవా టికెట్ల విడుదల

396views

తిరుమల ఆర్జిత సేవా టికెట్ల ఆగష్టు కోటాను శనివారం టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది.
* తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల.
* సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డి సేవా టికెట్లు మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.
* టికెట్లు పొందిన వారు మే 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి.
* మే 17 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, శ్రీవారి ఆలయంలో ఆగష్టు 15 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న

వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను విడుదల.
* మే 21న మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల..
* మే 23న అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ టికడట్లు, వృధ్రులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల.
* మే 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
* మే 24 మద్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల.
* ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచన.