News

ఆర్జితసేవా టికెట్ల కోటాను రేపు విడుదల చేయనున్న టిటిడి

361views

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జితసేవా టికెట్ల కోటాను టిటిడి రేపు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. రేపు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ ద్వారా టోకెన్లను విడుదల చేస్తున్నట్లు ఈరోజు ఒక ప్రకటనలో టీటీడీ తెలిపింది.అసాగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 15 నుండి 17వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న వార్షిక ప‌విత్రోత్స‌వాల సేవా టికెట్లను మే 21వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అంతేకాకుండా ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది,శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల ఆన్ లైన్ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టోకెన్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.