
వాణిజ్య రాజధాని ముంబయిలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై ఇటీవల రష్మిక ప్రయాణించారు. ఈ అటల్ సేతును కారులో నుంచి వీక్షిస్తూ.. దాని గురించి మాట్లాడుతోన్న వీడియోను ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడం కంటే మించిన సంతృప్తి ఏముంటుందని సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ గౌరవార్థం ఎంటీహెచ్‌ఎల్‌కు ‘అటల్ సేతు’గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే.
నవీ ముంబయి నుంచి ముంబయి, గోవా నుంచి ముంబయి, బెంగళూరు నుంచి ముంబయి.. ఇలా అన్ని ప్రయాణాలు అద్భుతమై మౌలికసదుపాయాల కారణంగా సులభతరమైనప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. భారత్‌లో ఇది సాధ్యం కాదు అనే పరిస్థితి లేదు. గత పదేళ్ల కాలంలో దేశం గొప్ప ప్రగతి సాధించింది. ఈ వంతెన ఏడేళ్లలో పూర్తయిందని నాకు ఇటీవలే తెలిసింది. ఈ 20 కిలోమీటర్లు అద్భుతం. మొదట దీనిని చూసినప్పుడు నాకు మాటలు రాలేదు. ఈ యువభారతం అత్యంత వేగంగా, తెలివిగా దూసుకెళ్తోంది. ఇప్పుడు మనం అభివృద్ధికి ఓటు వేయాలి’’ అని జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ నటి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
https://x.com/i/status/1791092104896069827





