215views
తిరుపతిలోని గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ఉదయం చిన్న శేష వాహనంపై స్వామి వారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చిన్న శేషుడిపై చిద్విలాసం చేస్తున్న స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈరోజు రాత్రి హంస వాహన సేవ జరుగనుంది.





