News

‘పీవోకే’ భారత్‌లో భాగమే.. మేం దానిని చేజిక్కించుకుంటాం

341views

కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనలను ప్రస్తావిస్తూ.. పీవోకే భారత్‌లో భాగమే. మేం దానిని తీసుకుంటామని 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఒకప్పుడు సమస్యాత్మకమైన కాశ్మీర్‌లో శాంతి నెలకొందని అన్నారు.

ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆజాదీ నినాదాలు, నిరసనలతో ప్రతిధ్వనిస్తుంది. 2019లో ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్‌లో శాంతిని పునరుద్ధరించింది. అయితే ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఇక్కడ ఆజాదీ నినాదాలు వినిపించగా, ఇప్పుడు పీఓకేలో కూడా అదే నినాదాలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు ఇక్కడ రాళ్లు రువ్వేవారని, ఇప్పుడు పీఓకేలో రాళ్లు రువ్వుతున్నారు అని ఆయన అన్నారు.