News

నందీశ్వర స్వామికి విశేష పూజలు

126views

శ్రీశైలం మహాక్షేత్రంలో మంగళవారం లోకకళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య (కుమారస్వామి) స్వామికి, నందీశ్వరస్వామికి, బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో దేశం శాంతిసౌభాగ్యాలతో విరిసిల్లాలని అర్చకస్వాములు సంకల్పం పఠించారు, అనంతరం పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహా గణపతిస్వామికి పూజలు చేశారు. పంచామృతాలతో అభిషేకించి మంగళహారతులు సమర్పించారు.