
309views
సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా ఈనెల 10వ తేదీన అప్పన్న స్వామి దేహంపై నుంచి వేరుచేసిన నిర్మాల్య చందనం విక్రయాలు గురువారం నుంచి ప్రారంభించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18వ తేదీ మినహా 21వ తేదీ వరకు అయిదు రోజుల పాటు సింహగిరిపై ప్రసాదాల కౌంటర్ వద్ద ఉదయం 9 గంటల నుంచి చందనం విక్రయాలు జరుగుతాయని వివరించారు. పది గ్రాముల చందనం ప్యాకెట్ ధర రూ.10గా నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు.





