
( మే 14 – గంగా సప్తమి )
పురాణాల ప్రకారం వైశాఖ శుద్ద సప్తమి రోజున గంగాదేవి భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. హిందూ మతంలో ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
గంగా సప్తమి రోజు గంగాదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున గంగాదేవిని పూజిస్తారు. గంగా సప్తమి రోజున గంగాదేవి పునర్జన్మ పొందిందని మత విశ్వాసం. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తిథి రోజుని గంగా సప్తమిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం (2024)లో గంగా సప్తమి పండుగను 14 మే 2024 మంగళవారం జరుపుకోనున్నారు.
పురాణాల ప్రకారం వైశాఖ శుక్ల పక్షంలోని సప్తమి తిథి రోజున జాహ్నవి మహర్షి తన చెవి నుంచి గంగను విడుదల చేశాడు. ఈ కథ ప్రకారం గంగా సప్తమని జహ్న సప్తమి అని కూడా అంటారు. అదే సమయంలో కొన్ని పురాణ కథల ప్రకారం గంగాదేవిని జహ్న మహర్షి కుమార్తె జాన్వి అని కూడా పిలుస్తారు.గంగాసప్తమి అంటే గంగాదేవి జన్మదినాన్నే గంగాసప్తమిగా జరుపుకుంటూ ఉంటాం.ఇదే రోజున గంగమ్మ బ్రహ్మ దేవుని కమండలం నుంచి ఉద్భవించిందట.ఈ రోజున గంగమ్మను పూజిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షంలో ఏడవ రోజున ఈ పండుగ వస్తుంది.
ఆ తరువాత గంగాదేవికి హారతి ఇవ్వాలి. ‘ఓం నమో గంగాయై విశ్వరూపిణీ నారాయణి నమో నమః గంగా గంగా’ అనే మంత్రాన్ని పఠిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. గంగానది ఒడ్డున అయితే పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజున గంగానదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని నమ్మకం.





