News

మే 19 నుండి మోదకొండమ్మ ఉత్సవాలు

229views

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని మోదకొండమ్మ ఉత్సవాలు ఈ నెల 19వ తేదీ నుండి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా చెప్పబడే ఈ ఉత్సవాల పోస్టర్ను పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.