News

నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

272views

వైశాఖ శుద్ధ తదియని పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లా సింహాచలం పై కొలువై ఉన్న శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి. స్వామి వారి నిజరూప దర్శనాన్ని కల్పిస్తున్నారు. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి తెల్లవారుజామున ఒంటి గంట నుంచి దేవస్థానం అర్చకులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు స్వామి వారిపై ఉన్న చందనాన్ని వలిచి నిజరూపానికి తీసుకువచ్చారు చేస్తారు. అనంతరం ఉదయం నాలుగు గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం స్వామి వారికి తొలి విడతగా 120 కిలోల చందనాన్ని సమర్పిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.