News

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్న టిటిడి

377views

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 18న ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు టిటిడి గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, అదేవిధంగా శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 15 నుండి 17వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న వార్షిక ప‌విత్రోత్స‌వాల సేవా టికెట్లను మే 21వ తేదీ, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న, శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల ఆన్ లైన్ కోటాను మే 23న, వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఆగ‌స్టు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను మే 23న, ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న టిటిిడి ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.