
340views
అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఊటుకూరును భక్త కన్నప్ప జన్మ స్థలంగా గుర్తించాలని భక్తులు శ్రీకాళహస్తి దేవస్థానం ఈఓ ఎస్‌వీ నాగేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ ఎన్.ఈశ్వరయ్యలకు బుధవారం వినతి పత్రం అందజేశారు. మండలంలోని ఊటుకూరులో శివాలయాన్ని ఈవో సందర్శించారు. ముందుగా నాగలింగేశ్వర స్వామికి పూజలు చేశారు. తదనంతరం పట్టు వస్త్రాలు, పూల హారం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఊటుకూరును భక్త కన్నప్ప జన్మస్థలంగా ప్రభుత్వం గుర్తించి శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. ఊటుకూరులో భక్త కన్నప్ప దేవాలయం నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ఈఈ నూకా రత్నమ్మ, డిప్యూటీ ఈఓ ఏకాంబరం, ఏఈలు మల్లికార్జునప్రసాద్, క్రిష్ణ కుమార్, వేణుగోపాల్, ఏఈఓ ఏకే ధనపాల్, తదితరులు పాల్గొన్నారు.





