News

దలైలామాకు పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు

417views

భారత మాజీ ప్రధాని భారతరత్న దివంగత పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పివి నరసింహారావు మెమోరియల్ అవార్డును ప్రపంచ శాంతి దూత దలైలామాకు అందజేశారు. ధర్మశాలలోని దలైలామా నివాసంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు.

దివంగత పివి స్మారక అవార్డును అందుకుంటున్నందుకు దలైలామా హర్షం వ్యక్తం చేశారు. శాంతి ద్వారానే ప్రపంచం మనుగడ సాగించగలదని దలైలామా పేర్కొన్నారు. భారతరత్న పివి ప్రపంచశాంతి కోసం చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.