
295views
బోయింగ్ సంస్థకు చెందిన స్టారైనర్ వ్యోమనౌక తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర వచ్చే వారానికి వాయిదా పడింది. దీన్ని
మోసుకెళ్లే అట్లాస్-5 రాకెట్లోని సమస్యాత్మక వాల్ను మార్చాల్సి ఉందని నిపుణులు తేల్చడమే ఇందుకు కారణం. ఈ వ్యోమనౌకలో భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్
విల్మారాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్ఎస్)కి పయనం కావాల్సి
ఉంది. మంగళవారం ఉదయం స్టారైనర్ వ్యోమనౌక ప్రయోగం జరగాల్సింది. అయితే చివరి నిమిషంలో అట్లాస్-5 రాకెట్లోని ప్రెజర్-రిలీఫ్ వాల్వ్ ఇబ్బంది తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ సాధనం తన గరిష్ఠ పని
సామర్థ్యాన్ని దాటేసిందని, దాన్ని మార్చాలని ఇంజినీర్లు తెలిపారు. ఫలితంగా స్టార్నర్ ప్రయోగం ఈ నెల 17 లోపు జరిగే అవకాశం లేదు.





