
264views
తిరుమలలో ఈ నెల 22వ తేదీన నృసింహా జయంతి జరుగనుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి అర్చకులు ప్రత్యేక అభిషేకం చేస్తారని వివరించారు. కాగా నిన్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందనీ తెలిపాడు. అలాగే స్వామివారిని 65 వేల 146 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు.





