
265views
2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. గత ఏడాది ప్రపంచంలో మొత్తం విద్యుత్తులో 5.5 శాతాన్ని సూర్యుడి వెలుగుతోనే సాధించినట్లు ‘ఎంబెర్’ మేధోమథన సంస్థ నివేదిక తెలిపింది. ఇది మన దేశంలో 5.8 శాతంగా ఉంది. 2023లో సౌర విద్యుత్తు పెంచుకోవడంలో చైనా (+156 టెరావాట్ అవర్) మొదటి స్థానంలో ఉండగా అమెరికా (+33 టీడబ్ల్యూహెచ్), బ్రెజిల్ (+22 టీడబ్ల్యూహెచ్), భారత్ (+18 టీడబ్ల్యూహెచ్) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చైనా సహా ప్రపంచంలో పలు దేశాల్లో జలవిద్యుదుత్పత్తి ఐదేళ్ల కనిష్ఠస్థాయికి తగ్గిపోయిందని, లేదంటే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ఇంకా పెరిగేదేనని వివరించింది. పవన, సౌర విద్యుత్తు రంగాల్లో పురోగతి వల్ల ప్రపంచవ్యాప్తంగా శుద్ధ ఇంధనం వాటా ఇప్పుడు 40 శాతానికి చేరినట్లు వెల్లడించింది.





