
Jammu and Kashmir, Jan 26 (ANI): Army Jawans hold the National Flag and raise slogans near the snow-covered border on the occasion of 71st Republic Day in Kupwara on Sunday. (ANI Photo)
187views
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వాడా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న మారుమూల పల్లెకు చెందిన ఓ గర్భిణి ఆరోగ్యం విషమించింది. స్థానికంగా వైద్య నిపుణులు అందుబాటులో లేని దుస్థితి. రోడ్డు మార్గంలో వేరేచోటికి తరలించాలన్నా.. స్థానికంగా భారీగా మంచు కురవడంతో రహదారులన్నీ మూసుకుపోయాయి. ఈ విషయం తెలుసుకున్న గుగల్ధార్ బెటాలియన్ రంగంలోకి దిగింది. జుమాగుండ్‌లోని ఆర్మీ యూనిట్ నర్సింగ్ అసిస్టెంట్, పీకే గలిలోని బెటాలియన్ వైద్యాధికారి తొలుత ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం స్ట్రెచర్‌పైకి చేర్చి.. గ్రామస్థుల సాయంతో కాలినడకన వేరే ప్రాంతానికి సురక్షితంగా తరలించారు.





