ArticlesNews

శ్రీరామ నామమే 1600 కిలోమీటర్లు నడిపించింది

260views

ఎనిమిది పదుల వయస్సులో 1600 వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అంటే మామూలు విషయం కాదు. అంతే కాకుండా మార్చ్ 16 నుండి ఏప్రిల్ 16 వరకు విపరీతమైన ఎండలో పాదయాత్ర అదేమీ అంత సామాన్యమైన విషయం కాదు.

కానీ సంకల్పం ఉంటే ఏదైనా సాధించ వచ్చని నిరూపించారు. అంతే కాకుండా నా గొప్పతనమేమి లేదు అంతా ఆ శ్రీరామనామమే మమ్మల్ని 1600 కిలోమీటర్లు నడిపించిందని కృష్ణాపురం రామానందస్వామి చెబుతున్నారు

అల్లూరి సీతారామ జిల్లా చింతపల్లి మండలం పెదబారడ వంచాయితీ కృష్ణాపురం గ్రామం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ దామరాజు వెంకట రామ యోగీశ్వర గురు మహారాజు ఆశ్రమం (శ్రీ పాకాలపాడు గురుదేవుల) ఆశ్రమం పూజ్య శ్రీ రామానంద స్వామి వారి ఆధ్వర్యంలో విశ్వ శాంతి లోక కళ్యాణార్ధం సనాతన పరిరక్షణ కోసం కృష్ణాపురం నుంచి అయోధ్య 20 మంది శిష్య బృందంతో దిగ్విజయంగా పాదయాత్ర పూర్తి చేశారు. క్షేమంగా విచ్చేసిన శుభసందర్భంగా వారిని కలిసి వారి దీవెనలు పొండటానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బాంబే నుంచి అఖిల భారత వనవాసి కళ్యాణ్ ఆశ్రమం అధికార మాన్యం సోమయాజులు భక్తులనుద్దేశించి దేశం ధర్మం రాష్ట్రం పలుకీలకమైన అంశాలపై చర్చించారు.

గురు దేవులకు భక్తులు వినమ్ర భక్తి శ్రద్ధలతో దుస్సాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో గురుదేవుల సంఘ అధ్యక్షులు మత్యారాస. మఠ్యరాజు -కార్యదర్శి సెగ్గే.సత్యనారాయణ భక్తులు సాగిన, మోహనదాస్, గెమ్మెలి. ప్రతాప్, గెమ్మెలి. మోహనరావు, లోచలి. రామకృష్ణ, సెగ్గే. నాగేశ్వరరావు, వానవాసి, సమరసత సేవా ఫౌండేషన్, విశ్వాహిందు పరిషత్ కార్యకర్తలు జీ మాడుగుల, కొయ్యూరు, చింతపల్లి జీకే వీధి మండలాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.