కోల్‌కతా శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. 98 ఏళ్ల మాతాజీ వృద్ధాప్య సంబంధిత రుగ్మతలతో బాధపడేవారు. రామకృష్ణ మఠం నిర్వహణలోని రామకృష్ణ సేవా ప్రతిష్ఠాన్ ఆసుపత్రిలో చికిత్స పొంది కొద్దిరోజుల క్రితమే డిశ్ఛార్జి అయ్యారని శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మఠం ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక్కడి శారదా మఠం కేంద్ర కార్యాలయంలో అమెకు చికిత్స జరిగేదని, మంగళవారం ఉదయం 9.45 గంటలకు తుదిశ్వాస విడిచారని వెల్లడించారు. ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. సమాజానికి ఆమె అందించిన అద్వితీయ సేవలు, ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంలో ఆమె చేసిన కృషి చిరకాలం గుర్తుంటుందని చెప్పారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సంతాపం ప్రకటించారు.
323views
You Might Also Like
Vishwa Mangalya Sabha to Hold North India Awareness Meeting in Delhi
41
RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji to Engage in a Special Dialogue with Enlightened MatriShakti New Delhi. Vrushali Joshi, National...
‘‘ఉపా’’ చట్టం కింద ముగ్గురు పబ్లిషర్స్ ను అరెస్ట్ చేసిన జమ్మూ పోలీసులు
38
జమ్మూ కాశ్మీర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ ముగ్గురు ప్రచురణ కర్తలను ఉపా చట్టం కింద అరెస్ట్ చేసింది. 'పర్సనాలిటీస్ అండ్ లెజెండ్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్'...
100 కోట్ల విలువైన దేవాలయ భూమిని 2 కోట్లకే ప్రైవేట్ వ్యక్తులకు….
47
సుప్రసిద్ధ పళని స్వామి దేవాలయానికి చెందిన సుమారు 100 కోట్ల విలువైన 1.4 ఎకరాల భూమిని ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడం సంచలనం రేపుతోంది. 2...
విజయవాడలో వందేమాతరం 150 సంవత్సరాల పండుగ
40
భౌతికంగా సుప్రసిద్ధ గాయని ఎస్. జానకి మన మధ్య లేకపోయినా ఈ జగత్తు ఉన్నంతకాలం ఆవిడ పాట మారుమ్రోగుతూనే ఉంటుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి...
విత్తన బంతులతో సహజ అడవుల పునరుద్ధరణ
41
సీడ్ బాల్స్ విత్తన బంతులు ద్వారా సహజ అడవుల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు జిల్లా అటవీశాఖ అధికారి పీవీ సందీప్ రెడ్డి తెలిపారు. జీలుగుమిల్లి...
హైదరాబాద్ స్కూల్లో.. హిందూ విద్యార్థికి ‘కల్మా’ హోంవర్క్
32
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తీవ్ర వివాదం చెలరేగింది. రెండో తరగతి చదువుతున్న హిందూ విద్యార్థికి ఇస్లామిక్ మతానికి సంబంధించిన సూరాలను హోంవర్క్‌గా ఇవ్వడం ఈ వివాదానికి...





