
240views
ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు చైనాతో జరుపుతున్న చర్చలు సజావుగా, సానుకూల వాతావరణంలో సాగుతున్నాయని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న రాజ్‌నాథ్.. భారత్ ఎప్పుడూ తలవంచదన్నారు.‘‘భారత్ ప్రస్తుతం బలహీనమైన దేశం కాదు. సైనిక పరంగా ఎంతో శక్తిమంతంగా మారింది. మన పొరుగు దేశాలతో సత్సంబంధాలను కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలనుకుంటోంది. ఈ చర్చల ఫలితాలు ఎలా ఉండబోతాయే తెలుసుకునేందుకు కాస్త వేచి చూడాలి. అలా అని భారత్ ఎవరి ఎదుట తలవంచదు. ఇలా ఎప్పటికీ జరగదని భరోసా ఇస్తాం’’ అని వ్యాఖ్యానించారు.





