
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని మహంకాళేశ్వరుడి ఆలయం మధ్యప్రదేశ్ లో ఉంది. ఈ రాష్ట్రంలో పురాతన, మధ్యయుగ దేవాలయాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఖజురహో దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందాయి. ఇప్పటికీ ఈ దేవాలయాల్లో పూజలను నిర్వహిస్తున్నారు. దీనితో పాటు ఖజురహోలో ఉన్న ఒక ఆలయంలో రహస్యం దాగుతుంది. ఒక సంఘటన ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీనికి గల కారణాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటికీ గుర్తించలేకపోయారు.
ప్రపంచంలో నివసించే శివలింగం
భారత దేశంలో మాత్రమే కాదు అనేక దేశాల్లో శివ లింగాలు కనిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలోని మాతంగేశ్వర ఆలయ రహస్యం చాలా ప్రత్యేకమైనది. అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కూడా. ఈ ఆలయంలో ఉన్న శివలింగం జీవం ఉన్న శివలింగంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ శివలింగం ఎత్తు ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఈ శివలింగం ఎంత ఎత్తుకు ఎదిగిందంటే ప్రస్తుతం ఈ శివలింగం పొడవు దాదాపు 9 అడుగులకు చేరుకుంది. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలోని శరత్ పూర్ణిమ రోజున దీని పొడవు పెరుగుతుందని చెబుతారు. అది కూడా శివలింగం నువ్వుల విత్తనం పరిమాణం అంత పెరుగుతుందట. ఈ విషయాన్నీ ధృవీకరించడానికి శివలింగం పొడవును పర్యాటక శాఖ ఉద్యోగులు కొలుస్తారు. ఇలా కొలిచిన ప్రతిసారీ శివలింగం పొడవు మునుపటి కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు చెబుతారు.





