News

హనుమాన్ శోభాయాత్రను జయప్రదం చేయండి ; గోకరాజు గంగరాజు

315views

హనుమత్ జయంతి సందర్భంగా జూన్ 1వ తేదీన విశ్వహిందూపరి షత్, మహానగర్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీహనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని వీహెచ్ పీ కేంద్రీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు అన్నారు. సత్యనారాయణపురం విశ్వహిందూపరిషత్ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన శ్రీ శైవపీఠాధిపతి శివస్వామితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి సంబందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశోభాయాత్ర జూన్1వ తేదీ సాయంత్రం 4గంటలకు బీఆర్డీఎస్ రోడ్డు రామకోటి నుంచి ప్రారంభమై వన్ టౌన్ మిల్క్ ప్రాజెక్టు వరకూ సాగుతుందన్నారు. వీహెచ్పి నాయకులు యక్కలి రాఘవులు, రాఘవరాజు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.