
252views
తిరుపతి జిల్లాలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలను నిర్వహిస్తున్నట్లు టిటిడి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పద్మావతీ అమ్మవారి వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకుని మే 14వ తేదీ ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కూడా నిర్వహించనున్నట్లు టిటిడి ఆ ప్రకటనలో తెలిపింది. ఈ ఉత్సవాల కారణంగా మే 14, మే 21 నుండి 24వ తేదీ వరకు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకారసేవ, మే 23న తిరుప్పావడ సేవ, మే 24న లక్ష్మి పూజ ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది.





