News

సంఘమిత్ర చిన్నారుల మధ్య రోటరీ క్లబ్ 54వ వార్షికోత్సవం.

756views

ఈరోజు అనగా ఆగష్టు 4 ఉదయం నంద్యాల సంఘమిత్ర నిరాశ్రిత బాలుర ఆవాసమునందు నంద్యాల రోటరీ క్లబ్ 54 వ వార్షికోత్సవము జరిగింది. సంఘమిత్ర చిన్నారులు, కార్యవర్గ సభ్యులు డా. ఉదయ్ శంకర్ గారు అధ్యక్షులు నాగ సుబ్బారెడ్డిగారు, మనోహర్ జీ,సముద్రాల నాగరాజు, వెంకటేశ్వర్లు,శ్రీనివాస్ పాండే డా. అశోక్ , వెంకటయ్య గంగాధర్ మొదలగు వారి మధ్య ఎంతో ఆత్మీయంగా జరిగింది.

కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు డా. విజయభాస్కర రెడ్డి. కార్యదర్శి వివేకానందరెడ్డి పూర్వ అధ్యక్షలు శ్రీ కైలాస నాథరెడ్డి, శ్రీ గోళ్ల జయకృష్ణ, శ్రీ నెరవాటి సత్యనారాయణ, శ్రీ కళా మురళి, శ్రీ నాగరాజు, శ్రీమతి వసుమతి తదితర సభ్యులు పాల్గొన్నారు.

సంఘమిత్ర చేపడుతున్న వివిధ సేవా ప్రకల్పాల గురించి తెలుసుకొన్న క్లబ్బు సభ్యులు ఈ పవిత్ర కార్యంలో తమ వంతు సహకారం అందజేస్తామని హామి ఇచ్చారు.