
197views
ఇల కైలాసంగా వెలుగొందుతున్న శ్రీశైలం క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కైలాస వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శమిచ్చాడు. మహాదుర్గ అలంకారంలో భ్రమరాంబికాదేవి అమ్మవారు దర్శనమిచ్చారు. ఉగాది మహోత్సవాల్లో మూడోరోజు సోమవారం మల్లన్న ప్రభోత్సవం వైభవంగా నిర్వహించ నున్నారు. రాత్రి స్వామిఅమ్మవార్లకు నంది వాహన సేవ జరపనున్నారు. మహాసరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.





