
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు చైత్రమాస బ్రహ్మోత్సవాలు నిర్వహించను న్నట్లు ఈవో రామారావు తెలిపారు. మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో నిర్వహించిన కార్యక్రమంలో చైత్రమాస బ్రహ్మోత్సవాల కరపత్రాలను వైదిక కమిటీ సభ్యులు, అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ నెల 19న గంగా, పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులకు ఉదయం 9.30 గంటలకు మంగళ స్నానాలు, అనంతరం వధూవరులుగా అలంకరిస్తారని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, అఖండదీప స్థాపన, కలశారాధన, అగ్నిప్రతిష్ఠాపన, ధ్వజారోహణ కార్యక్రమాలను అర్చకులు శాస్త్రో క్తంగా నిర్వహిస్తారని తెలిపారు. 20, 21 తేదీల్లో మూల మంత్ర హవనాలు, కలశారాధన పూజలు, 22న రాత్రి 8 గంటలకు మల్లేశ్వరాలయం వద్ద ఉత్సవమూర్తులకు ఎదురుకోలోత్సవం, రాత్రి 10. 30 గంటలకు దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దివ్య లీల కల్యాణం భక్తుల సమక్షంలో నిర్వహిస్తారని తెలిపారు. 23న ఉదయం 9 గంటలకు సదస్యం, వేదస్వస్తి, 24న ఉదయం 10 గంటలకు పూర్ణా హుతి, ధాన్యకోట్నోత్సవం, దుర్గాఘాట్లో అవ భృత స్నానం, ధ్వజారోహణం సాయంత్రం 4 గంటలకు కృష్ణానదిలో దుర్గాఘాట్ వద్ద ఆదిదంపతుల హంస వాహన తెప్పోత్సవం నిర్వహిస్తారని వివరిం చారు. 25 నుంచి 27వ తేదీ వరకు సాయంత్రం 4.30 గంటలకు సాంస్కృతిక కార్యక్ర మాలు, రాత్రి 7.30 గంటలకు ద్వాదశ ప్రదక్షిణాలు, రాత్రి 8.30 గంటలకు పవళింపు సేవ నిర్వహిస్తారని రుత్వికులు తెలిపారు.
ఆది దంపతులకు వాహన సేవలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం 5 గంటలకు ఆదిదంపతులకు ఈ నెల 19న వెండి పల్లకీ సేవ, 20న రావణ వాహనం, 21న వెండి రథంపై ఊరేగింపు, 22న నందివాహనం, 23న సింహ వాహన సేవలు ఆలయ ప్రాంగణం, పశ్చిమ పురవీధుల్లో భక్తుల సమక్షంలో నిర్వహి స్తారని పేర్కొన్నారు.





