News

అంతరిక్ష యాత్రల్లో మహిళా శాస్త్రవేత్తలకు అవకాశం : ఇస్రో ఛైర్మన్

330views

భారత్ భవిష్యత్తులో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష యాత్రల్లో వ్యోమగాములుగా మహిళా శాస్త్రవేత్తలకు అవకాశం ఉంటుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్ అన్నారు. అందుకు 2040 దాకా ఆగాల్సిన పనిలేదని.. కొన్నేళ్లలో ఇది సాకారమవు తుందని చెప్పారు. మొట్టమొదటి అంతరిక్ష యాత్ర గగన్ యాన్కు వ్యోమగాములుగా టెస్ట్ పైలట్స్ ను ఎంపిక చేశామని.. మున్ముందు చేపట్టే మిషన్లలో పైలట్లే కాకుండా శాస్త్రవేత్తలే వెళ్లి పరిశోధనలు చేస్తారని తెలిపారు. కలాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్సీ(కేఐవైఈ) గచ్చిబౌలి లోని ఇండోర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఇన్ స్పైర్-హైదరాబాద్ కార్యక్రమానికి సోమనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నగరంలోని పాఠశాల, కళాశాలల నుంచి పెద్దఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. వారు అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చారు.

స్పేస్ ఎకానమీలో 70శాతం ఆదాయం అప్లికేషన్స్ నుంచే వస్తోంది.. మొబైల్ కమ్యూనికేషన్స్, రిమోట్ సెన్సింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్ వరకు చాలా సేవలున్నాయని చెప్పారు. ప్రతి మనిషికి ఆధార్ ఉన్నట్లే.. మున్ముందు ఐపీ నంబరు ఉండే అవకా శముందన్నారు. ఒకవ్యక్తి తమిళ్ మాట్లాడుతుంటేవెంటనే అనువాదం చేసి తెలుగులో వినిపించే సాంకేతికత అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఏఐ రాకతో విద్య, నైపుణ్యాలు, పనివిధానాల్లో చాలా. మార్పులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది వరకు ఆటోమొబైల్ అంటే మెకానికల్ ఇంజినీరింగ్ ఎక్కువగా ఉండేదని.. ఇప్పుడు ప్రతి కారులో 30-40 చిప్ల అమరికతో ఎలక్ట్రానిక్స్ పాత్ర పెరిగిందన్నారు.

* రూ. 21వేల కోట్ల ఎగుమతులు
డీఆర్డివో మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీష్రెడ్డి మాట్లా డుతూ.. ఈ ఏడాది మార్చి 31నాటికి భారత్ రూ.21 వేల కోట్ల విలువైన ఉత్పత్తులను 58 దేశాలకు ఎగుమతి చేసిందని చెప్పారు. గ్రీన్ ప్రొపెల్షన్, కాంపోజిట్ రాకెట్. మోటార్స్ వంటి క్లిష్టమైన సాంకేతికత అభివృద్ధిలో అంకుర సంస్థలు అద్భుతాలు చేస్తున్నాయని వివరించారు. త్వరలో కలాం స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు కేఐ వైఈ అధ్యక్షుడు నరేశ్ ఇండియన్ తెలిపారు.