
కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కల్యాణోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఈ నెల 18 నుంచి 24 వరకు వారం రోజులపాటు నిర్వహించే కల్యాణోత్సవాలకు రాష్ట్రం నలుమూలుల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ప్రభుత్వ నోటిఫైడ్ ఫెస్టివల్ కావడంతో ఆలయాన్ని సరికొత్త హుంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తులు స్వామివారిని త్వరగా దర్శించుకునేందుకు క్యూలను విస్తరించే పనులు వేగంగా చేస్తున్నారు. ఆలయంలో భక్తుల దాహార్తిని తీర్చేందుకు అడుగడుగునా ప్యూరిఫైడ్ తాగునీరు అందిచే చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. కల్యాణోత్సవాల ఆహ్వాన పత్రికలు, పోస్టర్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణోత్సవాల్లో భాగంగా స్వామి అధ్యయనోత్సవాలు ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు తిరుమంజన సేవ నిర్వహించారు.





