News

మధ్య యుగాల నాటి విష సంస్కృతికి చరమ గీతం

919views

తలాక్… తలాక్… తలాక్… ముస్లిం మహిళలకు శాపం ఈ పదం. ముస్లిం పురుషుల బ్రహ్మాస్త్రం. ఏ చిన్న గొడవైనా సరే భార్య నుంచి విడిపోతామని బెదిరించే వారున్నారు. దీనిపై నరేంద్ర మోడీ ప్రభుత్వం అధ్యయనం చేసి కఠినమైన చట్టం తీసుకొచ్చింది. మధ్య యుగాల నాటి విష సంస్కృతికి చరమ గీతం పాడింది. ఆ చట్టానికి ఎట్టకేలకు ఎగువ సభ రాజ్యసభ ఆమోదం తెలిపింది. చట్టరూపం దాల్చేందుకు అడుగుదూరమే మిగిలి ఉంది. రాష్ట్రపతి ఆమోదం, తర్వాత గెజిట్ విడుదలతో దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్ నిషేదం అమల్లోకి వస్తోంది. ఇలాంటి చట్టం కోసం ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న బాధిత ముస్లిం మహిళలకు స్వాంతన చేకూరనుంది. బిల్లు చట్టరూపం దాల్చడంతో ఇక ట్రిపుల్ తలాక్ పేరు చెప్పాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. నిరాధారంగా నింద మోపి విడిపోతామంటే కుదరదు, ఆధారాలు చూపాలి.  అలా కాకుండా ప్రవర్తిస్తే సదరు వ్యక్తి ఊచలు లెక్కించాల్సిందే. ప్రతిపక్షాల విమర్శల సంగతెలా ఉన్నా ట్రిపుల్ తలాక్ పై మోడీ ప్రభుత్వ నిబద్ధతపై దేశవ్యాప్తంగా ప్రశంశల వర్షం కురుస్తోంది.