News

మంగళగిరి వద్ద అక్రమంగా తరలిస్తున్న గోవులు పట్టివేత

291views

గుంటూరు జిల్లా మంగళగిరి కాజ టోల్ గేట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గోవులు రవాణాను అడ్డుకున్నారు. మినీ లారీ వాహనంలో అక్రమంగా తుని నుండి చిలకలూరిపేటకు అక్రమంగా 12 గోవులను తరలిస్తున్న వాహనాన్ని గోసంరక్షణ దళ్ కార్యకర్తలు కాజ టోల్గేట్ వద్ద అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితులను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి గోవులను గోశాలకు పంపే ఏర్పాటు చేశారు.