
324views
నంద్యాల నుంచి అరుణాచల క్షేత్రానికి ఈ నెల 24వ తేదీన ప్రత్యేక సూపర్ లగ్జరీ సర్వీసు ఏర్పాటు చేశామని నంద్యాల ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ మద్దిలేటి నాయుడు గురువారం తెలిపారు. ఈ సర్వీసు ఆదివారం ఉదయం 6 గంటలకు నంద్యాల నుంచి బయలుదేరి కాణిపాకం మీదుగా రాత్రికి అరుణాచలం చేరుకుంటుందన్నారు. మరుసటి రోజు సోమవారం సాయంత్రం అరుణాచలం నుంచి బస్సు బయలుదేరి వేలూరు మీదుగా నంద్యాల చేరుకుంటుందన్నారు. కాణిపాకం, వేలూరు స్వర్ణదేవాలయాల్లో ప్రయాణికులు, భక్తులు దర్శనం చేసుకోవడానికి వీలుగా బస్సును ఆయా క్షేత్రాల్లో నిలుపుతామన్నారు. ఈ సర్వీసుకు చెందిన టికెట్లను బస్టాండ్ రిజర్వేషన్ కౌంటర్, apsrtconline.inలో బుక్ చేసుకోవచ్చని సూచించారు.





