
313views
సముద్ర యానంలో పైరసీ నిరోధక ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటూ, విజయకేతనం ఎగురవేస్తున్న ‘ఐఎన్‌ఎస్ సుమిత్ర’ నౌకకు ప్రత్యేక పురస్కారం లభించిందని తూర్పు నౌకాదళ వర్గాలు తెలిపాయి. గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భారత నౌకాదళం అధిపతి, అడ్మిరల్ ఆర్.హరికుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అరేబియా సముద్రంలో 11 మంది సోమాలియన్ సముద్ర దొంగల నుంచి 17 మంది ఇరాన్ దేశీయులను, హైజాక్‌కు గురైన 19 మంది పాకిస్తాన్ జాలర్లను రక్షించిందని వెల్లడించారు. అనంతరం ఆయన నౌక అధికారులు, సిబ్బందితో మమేకమై, నౌక డెక్‌పై బృంద చిత్రాలు దిగారు.





