News

9 నుంచి వసంత నవరాత్రోత్సవాలు

295views

విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రతి రోజు అమ్మవారికి విశేష పుష్పార్చన జరుగుతుంది. 9వ తేదీన శ్రీక్రోధినామ సంవత్సరాదిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉగాది పర్వదినాన్ని నిర్వహిస్తారు. ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తులకు, ఉపాలయాల్లో దేవతామూర్తులకు తెల్లవారుజామున స్నపనాభిషేకం, విశేష అలంకరణ, నిత్యపూజల అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం, సాయంత్రం స్వామి వారి ఉత్సవ మూర్తులకు వెండి రథోత్సవం జరుగుతుంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహ మండప నుంచి ఊరేగింపు ప్రారంభమవుతుంది.