
176views
పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థుల సహాయార్ధం గోకవరానికి చెందిన విశ్వహిందూ పరిషత్ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు రూ.2 లక్షల సహాయం అందజేశారు. పాకిస్తాన్ నుంచి ఢిల్లీకి హిందువులు వలసలు వచ్చారని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఆయన ఆదివారం ఢిల్లీ వెళ్లి శరణార్థులను కలుసుకున్నారు. అనంతరం శరణార్థులకు మౌలిక వసతుల నిమిత్తం రూ.2 లక్షల సహాయం అందజేయడంతో పాటు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన గోకవరంలో మంగళవారం మీడియా సమావేశంలో ప్రాంతీయ భేదం లేకుండా హిందువులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు తమ సమితి సిద్ధంగా ఉందన్నారు.





