News

ప్రైవేటు ప్రయోగ వేదికకు అగ్నికుల్‌ రాకెట్‌

250views

అంతరిక్ష స్టార్టప్‌ అగ్నికుల్‌ కాస్మోస్‌ తన ప్రయోగానికి సన్నాహాలు వేగవంతం చేసింది. మంగళవారం షార్‌లో ఏర్పాటు చేసిన సొంత ప్రైవేటు ప్రయోగ వేదికకు అగ్నిబాన్‌ వాహకనౌకను తరలించారు. అగ్నికుల్‌ కాస్మోస్‌కు చెందిన రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని ఏఎస్‌ఎల్‌వీ కాంప్లెక్సులో అనుసంధానం చేశారు. అక్కడ నుంచి దీనిని ఉదయం 5.30 గంటలకు ప్రత్యేక వాహనం ద్వారా 9 గంటలకు ప్రయోగ వేదికకు తీసుకెళ్లారు. రాకెట్‌ 300 కిలోల పేలోడ్‌తో 700 కిమీల దూరం వెళ్లనుంది. షార్‌లోని అగ్నికుల్‌కు చెందిన మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి, కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అగ్నికుల్‌ కాస్మోస్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ స్పేస్‌ టెక్నాలజీ స్టార్టప్‌. దాని తొలి నియంత్రిత సబ్‌ ఆర్బిటల్‌ రాకెట్‌ను రూపొందించి, షార్‌లోని ప్రైవేటు ప్రయోగ వేదిక నుంచి ప్రయోగం చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.