
మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో ‘కవిత్రయ మహాభారతం.. వర్తమాన సమాజం: సమాలోచన’ అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. పాండురంగం కాళియప్ప స్వాగతోపన్యాసం చేశారు. అధ్యక్షత వహించిన తెలుగు శాఖాధిపతి ఆచార్య విస్తాలి శంకరరావు ప్రసంగిస్తూ మహాభారతాన్ని ఎవరు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో విషయాలు కనిపిస్తాయన్నారు. మహాగొప్ప గ్రంథం ఎందరికో ఆదర్శనీయమన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకుటూరు అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మహాభారతంలోని ప్రతి పాత్ర ఒక పాఠ్యాంశమవుతుందన్నారు. కృష్ణుడు ఒక తత్వవేత్త అని, మహాభారతంలో అనేక అంశాలు వికాస సూత్రాలేనని పేర్కొన్నారు. కురుక్షేత్ర యుద్ధానికి కారణం ప్రస్తావించారు. అప్పటి, ఇప్పటి యుద్ధం తీరుకు భేదాన్ని వివరించారు.
విశిష్ట అతిథి ఆనందకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏఐ టెక్నాలజీ, నానో టెక్నాలజీకి మూలాలు మహాభారతంలోనే ఉన్నాయన్నారు. జర్మనీ ఎస్‌ఆర్‌హెచ్ విశ్వవిద్యాలయానికి చెందిన గణేష్ తొట్టెంపూడి అంతర్జాలం ద్వారా పాల్గొని ప్రసంగించారు. గౌరవ అతిథి కందనూరు మధు, ఆత్మీయ అతిథులు ఏవీ శివకుమారి, పి.శ్రీనివాసరావు, బోట్్సవా, ప్రసంగించారు. ఆఫ్రికా నుంచి ఆచార్య శ్రీదేవి శ్రీకాంత్ అంతర్జాలం ద్వారా ప్రసంగించారు. మహాసహస్రావధాని మేడసాని మోహన్ కీలకోపాన్యాసం చేస్తూ ధర్మబద్ధమైన కోరికలు ఉండాలని మహాభారతం మనకు తెలియజేస్తోందని పేర్కొన్నారు. మాదా శంకరబాబు వందన సమర్పణతో సమావేశం ముగిసింది. సమావేశాలుగా అధ్యక్షులుగా వై.విజయానందరాజు,





