News

నేడు ఉయ్యూరు వీరమ్మతల్లి శిడిబండి మహోత్సవం

357views

కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో భాగంగా 11వరోజు గురువారం శిడిబండి వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం వివాహానికి సిద్ధంగా ఉన్న దళిత కుటుంబానికి చెందిన ఓ యువకుడిని శిడిబండికి కట్టిన ఉట్టిబుట్టలో కూర్చోబెట్టి ఆలయ ప్రదక్షిణ చేయిస్తారు. అనంతరం శివాలయం కొబ్బరి తోట సమీపం నుంచి డప్పు వాయిద్యాలు, మేళతాళాల మధ్య వేలాది భక్తుల హారతులు అందుకుంటూ, ఊరేగింపుగా ప్రధానసెంటర్, ఊయల స్తంభాల నుంచి శిడిబండి ఆలయానికి చేరుకుంటుంది.ఆలయం ముందు శిడి బండిని నిలిపి మూడు సార్లు శిడి ఆడించటంతో శిడి బండి ఉత్సవం ముగుస్తుంది. వేడుకను తిలకిం చేందుకు భక్తులు వేలాదిగా తరలి వస్తారు.జోడు పొట్టేళ్ల ప్రభ బండ్లుతో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లిస్తారు. వేడుకకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటు గన్నవరం డీఎస్పీ జయసూర్య తెలిపారు.