News

పుణ్యక్షేత్రాల దర్శనానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సు

207views

మహాశివరాత్రి సందర్భంగా వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు ఆర్టీసీ బస్సు నడుపుతున్నట్లు తుని డిపో మేనేజర్‌ ఎన్‌.కిరణ్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. మార్చి 5న బస్సు తునిలో బయలుదేరి పూరి, కోణార్క్‌, సాక్షిగోపాలం, భువనేశ్వర్‌, జాజ్‌పూర్‌, గయ, బుద్ధగయ, శిరోగయ మీదుగా మహాశివరాత్రి రోజున కాశీ చేరుకుంటుందన్నారు. అక్కడ మూడు రోజుల బస అనంతరం త్రివేణి సంగమం, సీతామడి, ప్రయాగ, అయోధ్య, నైమిశారణ్యం దర్శనం ఉంటుందన్నారు. భక్తులకు ఉదయం, సాయంత్రం టీ, టిఫిన్‌, మధధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేశామన్నారు. టికెట్టు ధర రూ.12,500 గా నిర్ణయించామన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 73829 13216, 73306 51904 నంబర్లలో సంప్రదించాలన్నారు.