
331views
అయోధ్యలో రామ మందిరం ప్రారంభమవడంతో రామరాజ్య స్థాపన దిశగా ప్రయాణం మొదలైనట్లయిందని విశ్వహిందూ పరి షద్ (వీహెచ్పీ) పేర్కొంది. రానున్న సార్వత్రిక ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని వ్యాఖ్యానించింది. భవిష్యత్తు తరాలకు సురక్షిత, సౌభాగ్య, శక్తిమంతమైన భారత్ను అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వ్యక్తిగత ప్రాధాన్యాలను పక్కన పెట్టి, జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఓటెయ్యాలని హిందూ సమా జానికి పిలుపునిచ్చింది. భారతీయ సంస్కృతి, విలువలను పరిరక్షించే ప్రభు త్వాన్ని ఎన్నుకోవాలని కోరింది. అయోధ్యలో వీహెచ్పీ ధర్మకర్తల కేంద్ర మండలి, పరిపాలన మండలి సమావేశంలో సోమవారం ఈ మేరకు రెండు తీర్మానాలకు ఆమోద ముద్ర వేసింది.





