
271views
‘మిలాన్-2024’ అంతర్జాతీయ బహుళపక్ష నౌకాదళాల విన్యాసాల్లో భాగంగా ఈరోజు నుంచి ‘సీ-ఫేజ్’ విన్యాసాలు ప్రారంభమవుతాయని నేవీ వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 19 నుంచి విశాఖపట్నం కేంద్రంగా విన్యాసాలు కొనసాగుతున్నాయి.
రెండో విడతలో వివిధ దేశాల యుద్ధనౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, సైనిక బృందాలు విన్యాసాల్లో పాల్గొంటాయని తెలిపాయి. ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌకలు విన్యాసాల్లో భాగస్వామ్యమవుతున్నట్టు తెలిపాయి.





