NewsSeva

నంద్యాల సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ

540views

నంద్యాల సంఘమిత్ర సేవా సమితి గత రెండు సంవత్సరాలుగా స్థానిక యన్ కొత్తపల్లి శ్రీ శారదా విద్యాపీఠం కేంద్రంగా పరిసర గ్రామాల విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. 2023-24 విద్యా సంవత్సరంలో విద్యార్థులు తాము గత 8 మాములుగా నేర్చుకున్న అంశాలను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర వ్యవస్థాపకులు డాక్టర్ కాదర్ బాద్ ఉదయ శంకర్, కార్యదర్శి చిలుకూరు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు వివి రమణయ్య గౌడు, వెంకటయ్య, సేవా ప్రముఖ్ శ్రీనివాస్ లతో పాటు విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొని విద్యార్థులకు చక్కని శిక్షణ ఇచ్చిన నరసింహ కృషిని ప్రశంసించారు, శిక్షణ కు వసతి సౌకర్యం కల్పించిన శ్రీ శారదా విద్యాపీఠం యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.

విద్యార్థులు తాము పొందిన శిక్షణ పునాదిగా ఎత్తెన శిఖరాలు అధిరోహించి, తమ పరిధిలో అవసరంలో ఉన్న వారికి స్వచ్చందంగా సహకరిస్తూ ఆదర్శవంతమైన దేశభక్తి గల పౌరులుగా ఎదగాలని ఈ
సందర్భంగా ఆకాంక్షించారు.