
288views
శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని రష్యా దేశానికి చెందిన దాదాపు ముప్పై మంది బృంద సభ్యులు సందర్శించారు. సోమవారం ఆలయంలోని రూ.750 రాహు, కేతు మండపంలో దోష నివారణ పూజలను చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. క్రమశిక్షణతో క్యూలైన్లో వెళ్తూ దర్శనం చేసుకోవడం చూపరులను మరింతగా ఆకట్టుకుంది.





