Newsvideos

ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి

118views

ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభలో ఇవాళ యూనిఫాం (కామన్) సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో జరుగుతున్న శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతిపాదిత యూనిఫాం సివిల్ కోడ్ సమాజంలోని అన్నివర్గాలకూ మంచి చేస్తుందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవచించిన ‘సబ్‌కా సాథ్ – సబ్‌కా వికాస్’, ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’ను సాకారం చేసే దిశలో యూసీసీ కీలక ముందడుగు అని ధామీ వ్యాఖ్యానించారు.