
305views
జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని మిగతా సెల్లార్లలోనూ సర్వే నిర్వహించేందుకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కు ఆదేశాలివ్వాలని కోరుతూ వారాణిసిలోని ట్రయల్ కోర్టులో ఓ హిందువు పిటిషన్ వేశారు. ఆవరణ మతపరమైన స్వభావాన్ని నిర్ధారించేందుకుగాను ఈ సెల్లార్లను సర్వే చేయడం చాలా కీలకమని తెలిపారు. జిల్లా కోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. జ్ఞానవాపి ఆవరణలో ఇటీవల నిర్వహించిన సర్వే సందర్భంగా దర్యాప్తు చేపట్టని సెల్లార్లలో ఏఎస్ఐ సర్వే చేపట్టాలని కోరారు.





