News

అరచేతిలో ఇమిడిపోయేంత సూక్ష్మ స్వర్ణ అయోధ్య రామ మందిరం

241views

అయోధ్య రామ మందిరం స్వర్ణ నమూనా సందర్శకులను ఆకట్టుకుంటోంది. విజయవాడలోని ఓ బంగారు ఆభరణాల ప్రదర్శనలో 22 క్యారెట్ల బంగారంతో అరచేతిలో ఇమిడిపోయేంత సూక్ష్మ మందిరాన్ని తయారు చేసి అబ్బురపరిచారు. 412 గ్రాముల బంగారంతో నాలుగు అంగుళాల ఎత్తు, ఆరు అంగుళాల వెడల్పు ఉండేలా హస్త కళాకారులు దీన్ని రూపొందించారు.