ArticlesNews

భారతమాత పదసేవలో సుదీర్ఘ పథికుడు

269views

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్‌కృష్ణ అద్వానీని భారతరత్న పురస్కారం వరించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి అన్నివిధాలా అర్హుడైన నాయకుడు ఉక్కుమనిషి లాల్‌కృష్ణ లాల్‌కృష్ణ అద్వానీ. లాల్‌ కృష్ణ లాల్‌కృష్ణ అద్వానీ.. ఈ పేరే ఒక బ్రాండ్‌. ఎక్కడో 2 స్థానాలకు పరిమితమైన భారతీయ జనతా పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకొచ్చిన వారిలో ఆయన ముందు వరుసలో ఉంటారనడంలో సందేహం లేదు. ఆయన చేపట్టిన రథయాత్ర ఓ వర్గం ఓట్లను సంఘటితం చేసింది. భాజపా గెలుపునకు బాటలు వేసింది. ఓటమితో నిరుత్సాహపడకుండా విజయం కోసం అడ్వాణీ అహర్నిశలూ శ్రమించారు. ఆయనలోని ఆ పోరాట పటిమ, క్రమశిక్షణ వెనక రాష్ట్రీయ స్వయంసేవక్‌ మూలాలూ ఓ కారణం. ఆ సంస్థతో ఆయనది సుదీర్ఘ అనుబంధం. అయితే, సంఘ్‌లో అద్వానీ చేరిక కూడా అనుకోకుండా జరిగిందే. ఈ విషయాన్ని ఆయనే తన ఆత్మకథ ‘మై కంట్రీ మై లైఫ్‌’లో పేర్కొన్నారు. ఆయనకు కేంద్రం ‘భారత రత్న’ ప్రకటించిన సందర్భంగా

ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.
అడ్వాణీ పూర్తి పేరు లాల్‌ కృష్ణ అద్వానీ. 1927 నవంబరు 8న అవిభక్త భారత్‌లోని కరాచీ (ప్రస్తుతం పాక్‌లో ఉంది)లో జన్మించారు. దేశ విభజన తర్వాత భారత్‌లో స్థిరపడ్డారు. తనదైన ప్రసంగాలతో ఆకట్టుకునే అద్వానీకి అసలు హిందీ వచ్చేది కాదట. భారత్‌ వచ్చేవరకు ఆయనకు హిందీలో అసలు ప్రావీణ్యమే లేదట. హిందీ సినిమాలు చూడడం ద్వారా భాషను అర్థం చేసుకొని వచ్చీరాని భాషలోనే నెట్టుకొచ్చేవారు. 1947 తర్వాత తన 20వ ఏట భారత్‌కు వలస వచ్చిన తర్వాతే హిందీ చదవడం, రాయడం నేర్చుకున్నానని ఆత్మకథలో వివరించారు. ఆ తర్వాత అదే హిందీలో ఆయన అనర్గళంగా మాట్లాడటమే కాదు.. తనదైన శైలి ప్రసంగాలతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు కూడా.

అలా ఆరెస్సెస్‌లోకి..
ఎల్‌కే అద్వానీకి స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్-ఆరెస్సెస్‌తో అనుబంధం ఉంది. 1941లో తన పద్నాలుగేళ్ల వయసులోనే ఆయన ఆరెస్సెస్‌లో చేరారు. 1947లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. అయితే, ఆరెస్సెస్‌తో ఆయన ప్రయాణం అనుకోకుండానే జరిగిందని తన ఆత్మకథలో చెప్పారు. అద్వానీ తండ్రి సింధ్‌ నుంచి హైదరాబాద్‌ (పాక్‌)కు మారారు. అప్పటికి మెట్రిక్యులేషన్‌ పూర్తయిన అడ్వాణీ కళాశాలలో చేరడానికి ముందు సెలవురోజుల్లో టెన్నిస్‌ ఆడేవారట. అలా ఒకరోజు తన స్నేహితుడు ఆట మధ్యలో వెళుతుండగా.. ‘ఎందుకు వెళ్లిపోతున్నావ్‌’ అంటూ ఆయనను ప్రశ్నించారు. తాను ఆరెస్సెస్‌లో చేరానని, అనుకున్న సమయానికి వెళ్లాల్సిందేనని చెప్పాడు. అలా తొలిసారి ఆరెస్సెస్‌ పేరును అద్వానీ విన్నారు. తర్వాత దాని గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకొని తర్వాత ఓరోజు ఆరెస్సెస్‌ శాఖకు హాజరయ్యారు. అలా ప్రారంభమైన తన జీవితం.. సంఘ్‌కు అంకితమైందని తన ఆత్మకథలో ఆయన వివరించారు.

అద్వానీ భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా 1986 నుంచి 1990 వరకూ, 1993 నుంచి 1998 వరకూ, చివరిగా 2004 నుంచి 2005 వరకూ పనిచేసారు. సుమారు మూడు దశాబ్దాల పాటు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన ఆఢ్వాణీ, వాజ్‌పేయీ మంత్రివర్గంలో హోంమంత్రిగా, ఉపప్రధానమంత్రిగా సేవలందించారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఉద్యమం ప్రారంభించి, రథయాత్రతో దేశమంతా చైతన్యం కలిగించిన నాయకుడు అద్వానీ. ఆయన తనను తాను ‘రథయాత్రికుడి’గా అభివర్ణించుకున్నారు. 1990 సెప్టెంబర్ 25న గుజరాత్‌లోని సోమనాథ్‌లో అద్వానీ రథయాత్ర ప్రారంభమైంది. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చివేత వరకూ ఆ యాత్ర కొనసాగింది. దేశప్రజలలో జాతీయవాదాన్ని వ్యాపింపజేయడంలో ఆఢ్వాణీ చేసిన కృషి అనన్యసామాన్యమైనది.

అద్వానీ ధీశాలి, నైతిక విలువలకు కట్టుబడినవారు. సుదృఢమూ సుసమృద్ధమూ అయిన భారతదేశాన్ని సాధించడమే లక్ష్యంగా పనిచేసిన గొప్ప నాయకుడు.

1980ల ద్వితీయార్థం నుంచీ ఆయన ఒకే లక్ష్యం కోసం పనిచేసారు. జాతీయవాద భావాలతో ప్రజల కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీని ప్రబల జాతీయ రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే ఆ లక్ష్యం. 1984లో పార్లమెంటులో కేవలం 2 స్థానాలు మాత్రమే ఉన్న బీజేపీ ఎదుగుదల అద్వానీ పుణ్యమే. ఆయన కృషి ఫలితంగానే 1989 ఎన్నికల్లో ఆ పార్టీ 86 సీట్లు గెలుచుకుంది. 1992లో పార్టీ 121 స్థానాలకు ఎదిగింది.

1996లో బీజేపీ 161 స్థానాలు కైవసం చేసుకుంది. స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యానికి అప్పుడే గండి పడింది. ఆ పార్టీ గద్దె దిగింది. లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఆ క్రమంలో ఆ పార్టీకి అన్నీ తానే అయి నడిపించిన మహానేత లాల్‌కృష్ణ ఆఢ్వాణీ. ఆయన స్థానాన్ని ఇతరులెవ్వరూ అందుకోలేరు.