News

11 రోజుల్లో 25 లక్షలమంది.. భక్తజన సంద్రంగా అయోధ్య

256views

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరానికి భక్తజనం భారీగా పోటెత్తుతున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిశాక.. గత 11 రోజుల వ్యవధిలో దాదాపు 25 లక్షలమంది భక్తులు బాలరాముణ్ని దర్శించుకొన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఆలయ హుండీకి రూ.11 కోట్ల మేర విరాళాలు అందినట్లు తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయ నిర్వాహకులు దర్శన సమయాలను ఇటీవల పొడిగించిన విషయం తెలిసిందే. ఉదయం 6.00 గంటల నుంచి రాత్రి 10.00 గంటల వరకు భక్తులు ఆలయాన్ని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు.