News

జ్ఞానవాపిలో మొదలైన పూజలు

360views

యూపీలోని వారణాసిలో గల జ్ఞానవాపిలోని వ్యాసుని నేలమాళిగలో 30 ఏళ్ల తర్వాత పూజలు ప్రారంభమయ్యాయి. వారణాసి కోర్టు వెలువరించిన తీర్పు ప్రతి హిందువు హృదయంలో సంతోషాన్ని నింపిందని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.

ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కోర్టు ఈ ఉత్తర్వును స్వాగతించారు. దీనిపై ‘ఎక్స్‌’లో స్పందిస్తూ ‘శివ భక్తులకు న్యాయం జరిగింది. విశ్వనాథుని ఆలయ సముదాయంలోగల వ్యాసుని నేలమాళిగలో పూజలు చేసుకునే హక్కును మంజూరు చేస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని’ అన్నారు.


జ్ఞానవాపి మసీదులోని ‘వ్యాస్ కా తహఖానా’లో పూజలు చేయడానికి జిల్లా కోర్టు అనుమతి ఇవ్వడంపై కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే హర్షం వ్యక్తం చేశారు. ఇకపై ఏ పక్షానికి ఎలాంటి సమస్య ఉండదన్నారు.