News

ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి వేడుకలు

310views

ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఓ ప్రకటనలో తెలిపింది. సూర్య జయంతిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం జరుగుతుంది.

ఈ సందర్భంగా ఏడు వాహనాలపై శ్రీమలయప్పస్వామి ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ పర్వదినం నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది.

వాహన సేవల వివరాలు..

  • ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.40 గంటలకు) సూర్యప్రభ వాహనం.
  • ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం.
  • ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం.
  • మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం.
  • మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం.
  • సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం.
  • సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం.
  • రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం.