News

ప్రాణప్రతిష్ఠ రోజున ఆ దేశం కీలక నిర్ణయం.. హిందువులకు రెండు గంటలు ప్రత్యేక సెలవు

252views

రామ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని దేశ విదేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రారంభం కోసం దేశ విదేశాల్లో ఉన్న రామ భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ మారిషస్ ప్రభుత్వం రామ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది.మారిషస్ ప్రభుత్వం అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మారిషస్‌ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 22న ఆ దేశంలో నిర్వహిస్తున్న పూజల్లో పాల్గొనేందుకు, అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ వేడుకను టీవీల్లో చూసేందుకు హిందు అధికారులకు రెండు గంటల పాటు అనుమతి మంజూరు చేసింది. హిందూ సంఘాలు చేసిన విజ్ఞప్తిపై అక్కడి ప్రధాని అనిరుధ్‌ జగన్నాధ్‌ నేతృత్వంలోని కేబినెట్‌ చర్చించి రెండు గంటల ప్రత్యేక సెలవుకు అనుమతి ఇచ్చింది. మారిషస్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువుల జనాభా 48.5 శాతంగా ఉంది.

అమెరికా, బ్రిటన్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో ఉన్న భారతీయులకు రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం చూడాలనే ఉత్సాహం ఉంది. ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని యునైటెడ్ స్టేట్స్ న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో ప్రసారం చేయనున్నామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.